24 June, 2026 | 12:28 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

చర్మాన్ని మెరిపించే విటమిన్ - ఈ

06-04-2025 12:00 AM

విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది తాజాగా మెరుస్తూ ఉంటుంది. యూవీ కిరణాల నుంచి కూడా సంరక్షిస్తుంది. మరి ఇ విటమిన్ లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం..

* అవకాడోలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. చర్మానికి తేమ అందించి.. మృతకణాలను తొలగించి సహజంగా మెరిసేలా చేస్తుంది. 

* రోజూ ఓ పిడికెడు నానబెట్టినన బాదం తీసుకోవాలి. బాదంలో విటమిన్ ‘ఇ’ అధిక మోతాదులో ఉంటుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. 

* ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి చర్మాన్ని తాజాగా మెరిసేలా చేయడం లో పొద్దుతిరుగుడు గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

* పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ కంటెంట్‌తో పాటు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

* బ్రోకలీలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. తరచూ తీసుకుంటే.. చర్మంపై మృతకణాలు తొలగిపోయి.. చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరుస్తుంది. 

* సీఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో ఉండే ఇ విటమిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. కురులను ఆరోగ్యంగా, దృఢంగా చేస్తుంది. 

* బొప్పాయి పండులో విటమిన్ ఎ తో పాటు ఇ కూడా పుష్కలం. తరచూ తినడం వల్ల చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరిసిపోతుంది. ఎనీమియా సమస్యనూ అదుపులోకి తీసుకొస్తుంది. 

* కివీ పండ్లలో అధికంగా ఉండే సి, ఇ విటమిన్ల ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దాంతో పాటు శరీరానికి సరిపడా తేమ అంది చర్మం ప్రకాశిస్తుంది.