మారు మాట్లాడ‘కొండా’!
- మంత్రి పదవి నుంచి సురేఖ ఔట్
- గవర్నర్‌కు సీఎం రేవంత్ సిఫారసు లేఖ
- పార్టీ నేతలతో తరచూ విభేదాలు
- సొంత పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు
- చివరకు సురేఖకు డాటర్ స్ట్రోక్ ఎఫెక్ట్
- వివాదాల నుంచి ఉద్వాసన దాకా సురేఖ పయనం
- సురేఖ భవిష్యత్ రాజకీయంపై చర్చోపచర్చలు
వరంగల్ (మహబూబాబాద్), సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్(Warangal) రాజకీయాల్లో సంచలనం.. వర్గపోరాటాల నుంచి అధిష్ఠానం చర్యల దాకా దూకుడు రాజకీయానికి కేరాఫ్‌గా మారిన నాయకురాలు కొండా సురేఖ(Konda Surekha)కు చివరకు మంత్రి పదవి(Ministerial post)కే ఎసరు వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన కొండా సురేఖ ప్రస్థానం.. ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
ప్రజా సమస్యలపై దూకుడైన వైఖరి, ప్రత్యర్థుల(opponents)పై తీవ్ర విమర్శలు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు.. ఇలా రెండేళ్లుగా వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆమె రాజకీయ ప్రయాణం చివరకు మంత్రి పదవి కోల్పోయేలా చేసింది. తాజాగా సురేఖను మంత్రివర్గం(cabinet) నుంచి తొలగించాలనే సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సిఫారసుతో గవర్నర్ సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు.
ఫైర్ బ్రాండ్ ఇమేజ్.. ప్రత్యేక రాజకీయ శైలి
కొండా సురేఖకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. తనదైన దూకుడు శైలితో ప్రత్యర్థులపై విరుచుకుపడటం, బలమైన రాజకీయ వర్గాన్ని నిర్మించుకోవడం ద్వారా ఆమె జిల్లాలో ప్రభావశీల నేతగా ఎదిగారు. కాంగ్రెస్‌తోపాటు గతంలో బీఆర్‌ఎస్ లోనూ పనిచేసిన ఆమె.. చివరకు కాంగ్రెస్‌లో కీలక స్థానాన్ని సంపాదించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే ఇదే దూకుడు వైఖరి కాలక్రమంలో వివాదాలకు కారణమైందనే విమర్శలు కూడా వచ్చాయి.
మొదటి మంట.. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు
2024లోనే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కొండా సురేఖ, పరకాల ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ వివాదం తీవ్రరూ పం దాల్చింది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత పరి స్థితి మరింత ముదిరింది.
ఉమ్మ డి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సురేఖ తీరుపై అధిష్ఠానానికి ఫి ర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నా రని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశా రు. ఇదే అంశంపై 2024 అక్టోబర్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎ మ్మెల్యేలు సురేఖపై పార్టీ రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
నాగార్జున, సమంత వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు
2024 అక్టోబర్‌లో సినీ నటుడు నాగార్జున కుటుం బం, నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. వ్యక్తిగత జీవితాలను రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల నుంచి కూడా స్పందనలు వచ్చాయి. అనంతరం పరువునష్టం దావా అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం సురేఖకు రాజకీయంగా మరో వివాదాన్ని తెచ్చిపెట్టింది.
2025లో మరింత ముదిరిన ‘వరంగల్ వార్’
2025లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. కొండా సురేఖ మురళి దంపతులపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశా రు. ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ నేతలతో సమన్వయ లో పం తదితర అంశాలను ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. భద్రకాళి ఆలయ ట్రస్ట్ సభ్యుల నియామకం వి షయంలోనూ సురేఖకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి మధ్య విభేదాలు బయటపడ్డాయి.
మేడారం మరో కీలక వివాదం
సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పనులు, మేడారం మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టుల వ్యవహారంలోనూ మంత్రి సురేఖకు ఇతర మంత్రులతో విభేదాలు ఉన్న ట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జాతర పనుల టెం డర్ల వ్యవహారం కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించింది. అధికార పరిధి విషయంలో మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది.
ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్..
2025 అక్టోబర్లో మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సురేఖకు మరో తలనొప్పిగా మారింది. హైదరా బాద్లోని ఆమె నివాసానికి పోలీసులు వెళ్లడం, మాజీ ఓఎస్డీ వ్యవహారం, దానిపై రాజకీయ ఆరోపణలు.. ఇవన్నీ కలిసి కాంగ్రెస్లో మరోసారి కలకలం రేపాయి. ఈ సమయంలోనే సురేఖ భవిష్యత్పే రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
రాఖీతో రాజీ సంకేతాలా?
వివాదం తారాస్థాయికి చేరిన సమయంలోనే సురే ఖ సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం రాజకీయంగా ఆసక్తి రేపింది. దీంతో ఇరువర్గాల మ ధ్య రాజీ కుదిరిందా? వివాదానికి తెరపడిందా? అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత కూడా సురేఖపై చర్యల ఊహాగానాలు కొనసాగాయి.
ఢిల్లీకి చేరిన పంచాయితీ
చివరకు సురేఖ వ్యవహారం రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. అధిష్ఠానం పెద్దలను కలిసిన సురేఖ తనపై చర్యలు తీసుకోవద్దని వివ రణ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రెండు పర్యాయాలు కలిసి, తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకేమి సంబంధం లేద ని, తన కుమార్తె స్వతంత్ర వ్యక్తి అని, ఆమె చేసిన వ్యా ఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురే ఖ వివరణ ఇచ్చినట్లు వెల్లడించింది.
చివరి అంకం.. ‘కొండా’కు ఉద్వాస
ఇన్ని పరిణామాల అనంతరం సెప్టెంబర్ 3న కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కొండా సుస్మి త పటేల్ వ్యాఖ్యల నుంచి మొదలుకొని అంతకుముం దు జరిగిన పరిణామాలను పూర్తిగా పరిశీలించిన త ర్వాత పార్టీ అధిష్టానం, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఇచ్చి న నివేదిక ఆధారంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయించింది. ముందుగా తన కు తాను రాజీనామా చేయించాలని తలచినప్పటికీ, ఆమె నిరాకరించడంతో మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.
కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు
బలమైన ప్రజా సంబంధాలు,దూకుడు రాజకీయ శైలి,సొంత పార్టీ నేతలతో విభేదాలు, వరుస వివాదాలు, అధిష్ఠానం జోక్యం, సీఎం రేవంత్‌తో విభేదాలు, క్రమశిక్షణా చర్యలు, మంత్రి పదవి కోల్పోయే దశ.. ఇది కేవలం ఒక మంత్రి పదవి కోల్పోయిన వ్యవహారంగా మాత్రమే కాకుండా.. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో చాలాకాలంగా పేరుకుపోయిన అంతర్గత విభేదా లకు పరాకాష్ఠగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.
ఇక కొండా రాజకీయ భవిష్యత్ ఏంటి?
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొండా దంపతుల తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రధాన చర్చ. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ తిరిగి తన రాజకీయ బలా న్ని పెంచుకుంటారా? లేక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తారా? ఉమ్మడి వరంగల్లో తనకు ఉన్న రాజకీయ ప్రభావాన్ని తిరిగి నిలబెట్టుకోగలరా? ఇవన్నీ ఇప్పుడు ‘కొండా’ రాజకీయాల ముం దు నిలిచిన ప్రశ్నలు. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ రా జకీయాల్లో ‘కొండా’ అంటే ఓ శక్తి. ఇప్పుడు అదే ‘కొండా’ రాజకీయ శక్తికి కొత్త పరీక్ష మొదలైంది.
కూతురు వ్యాఖ్యలే.. కుర్చీకి ఎసరు!
గత నెల 19న నిర్వహించిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సీఎం పైనే కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. పరకాల ఎమ్మెల్యే సీటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై సురేఖపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకంగా పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడితో వ్యవహారం ఆగలేదు.
పార్టీ క్రమశిక్షణా కమిటీ సురేఖకు షోకాజ్ నోటీ సు ఇవ్వడం, తన తప్పేమీ లేదని, సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ వివరణ ఇవ్వడం ఫాస్ట్‌గా జరిగిపోయాయి. కొండ మురళి కూడా అధిష్టానానికి, పార్టీ క్రమశిక్షణ కమిటీకి త మ వివరణ వెల్లడించారు. చివరకు కొండా సురే ఖ మంత్రి పదవి నుంచి తొలగించడానికి కూతు రు సుస్మిత పటేల్ వ్యాఖ్యలు డాటర్ స్ట్రోక్‌లా మారాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.






