క్రూజర్ బోల్తా.. ఒకరి మృతి

21-09-2026 | 02:37pm

16 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

అచ్చంపేట, సెప్టెంబర్ 21: హైదరాబాద్‌–శ్రీశైలం ప్రధాన రహదారిపై (Hyderabad-Srisailam main road)క్రూజర్‌ బోల్తాపడిన ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకరు మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. కృష్ణగిరి (ఈగలపెంట) ఎస్సై జయన్న తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం బ్రహ్మగిరి సమీపంలోని ఆక్టోపస్‌ వద్ద సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా క్రూజర్‌ అదుపుతప్పి బోల్తాపడినట్లు తెలిపారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 16 మందిని చికిత్స నిమిత్తం స్వరూప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై జయన్న తెలిపారు.

మరిన్ని వార్తలు