కొండాపూర్‌లో సైక్లోథాన్

28-09-2026 | 05:10am

 శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్  ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): వరల్డ్ హార్ట్ డే(World Heart Day) సందర్భంగా కొండాపూర్‌లోని మసీద్ బంద వద్ద ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్స్ (Holistic Hospitals)ఆధ్వర్యంలో 10 కి.మీ. సైక్లోథాన్ నిర్వహించారు. సైక్లింగ్ కమ్యూనిటీ బైక్ -ఓ-హాలిక్స్ భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది రైడర్లు పాల్గొన్నారు. ఉదయం 6:30 గంటలకు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి హన్మంతరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ‘హార్ట్ అటాక్ ఫ్రీ సొసైటీ ఫర్ ది నేబర్హుడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అలాగే 40 ఏళ్లు పైబడిన అర్హులైన 1,000 మంది కొండాపూర్ స్థానికులకు ఉచిత సీటీ కొరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ స్క్రీనింగ్, కార్డియాలజీ కన్సల్టేషన్ అందించనున్నట్లు తెలిపింది. గుండె ధమనుల్లో లక్షణాలు కనిపించకముందే పేరుకుపోయే కాల్షిఫైడ్ ప్లేక్ను ముందుగానే గుర్తించడమే కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సైక్లోథాన్లో స్థానిక నివాసితులు, 100 మంది సైక్లింగ్ క్లబ్ సభ్యులు, 50 మందివైద్యులు పాల్గొన్నారు. అపర్ణ సెరీన్, హెచ్సీయూ, గచ్చిబౌలి జంక్షన్, ఏఎంబీ మాల్, బొటానికల్ గార్డెన్ మీదుగా 10 కి.మీ. రూట్ సాగింది. కార్యక్రమంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, చైర్మన్ ప్రొఫెసర్ డా.వీఎస్. రామచంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ డా. తుషార, మెడికల్ డైరెక్టర్ సుబ్బారావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరిబాబు పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు