దమ్మాయిగూడ ఎక్స్ లెన్సియా కళాశాల సీజ్
జవహర్ నగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న దమ్మాయిగూడ ఎక్స్లెన్సియా జూనియర్ కళాశాల(Excellencia Junior College)ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీఈఓ సీజ్ చేశారు. తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కళాశాల ఇంటర్ బోర్డు అనుమతి లేకుండా, ఫోర్జరీ ఎన్ ఓ సి పత్రాలతో నడుస్తుందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.
కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, కళాశాల అక్రమ ఫైర్ ఎన్ ఓ సి లు సమర్పించినట్లు నిర్ధారించి, కళాశాలకు షోకాజ్ నోటీసు జారీ చేసి రూ. 8 లక్షల జరిమానా విధించారు. అడ్మిషన్లు నిలిపివేయాలని, కళాశాలను నడపవద్దని ఆదేశించినా యాజమాన్యం బేఖాతరు చేసింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని, విద్యార్థులను ఇతర గుర్తింపు పొందిన కళాశాలల్లో చేర్పించాలని మళ్లీ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వగా, నేడు డీఈఓ స్వయంగా సందర్శించి కళాశాలను బంద్ చేసి సీజ్ చేశారు.