నవరాత్రి ఉత్సవాల్లో దండు సారయ్య సేవలు
ఇల్లెందు, (విజయక్రాంతి): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇల్లందు పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన వేడుకలు, అన్నదాన కార్యక్రమాల్లో 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య(Ward Councilor Dandu Saraiah) పాల్గొన్నారు. భద్రాద్రి 24 క్రాప్స్ యూనియన్ ఆధ్వర్యంలో 16వ వార్డులో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని విఘ్నేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
అదే విధంగా 5, 12, 13, 15, 16, 18, 21, 22వ వార్డుల్లో నిర్వహించిన నవరాత్రి వేడుకలు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సారయ్యను పలువురు అభినందించారు. కార్యక్రమాల్లో డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ కడారి వెంకటేష్, శ్రీకాంత్, శేఖర్, సాయి, కళ్యాణ్, కార్తీక్, దీపక్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.