4 September, 2026 | 12:01 AM

భద్రాచలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

15-06-2025 | 04:48pm

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు(MLA Dr. Tellam Venkat Rao) ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) 64వ జన్మదినోత్సవం సందర్భంగా మండల నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసే విక్రమార్క లాంటి నాయకుడు మరొకరు లేరన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అరికెల తిరుపతిరావు, పెద్దినేని శ్రీనివాస్, భీమవరపు వెంకటరెడ్డి, అన్నెం సత్యనారాయణ మూర్తి, చేగొండి శ్రీనివాస్, పడిసిరి శ్రీనివాస్, ధర్మారావు, యేసు రత్నం, ఓగ్గె రమణ, యూత్ కాంగ్రెస్ నాయకులు గాడి విజయ్, గాడి రాజేష్, మైధిలి బి తదితరులు పాల్గొన్నారు.