రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రిటైర్డ్ కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు, గోస్కుల ముత్యంరాజ్ముత్యంరాజ్
హుజురాబాద్,(విజయక్రాంతి): యజమాన్యం రిటార్ట్ ఆర్టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యక్షుడు గోస్కుల ముత్యరాజు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఆదివారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 20 22 నుంచి లీవ్లోకి సంబంధించిన బకాయిలు 2017 ఏరియా స్పేస్కేల్లో రావాల్సిన బకాయిలు యజమాన్యం ఇప్పటివరకు చెల్లించలేదని తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అయ్యర్ పెన్షన్ డబ్బులు కట్టిన వారికి ఇప్పటివరకు సక్రమంగా అందడం లేదని, కొంతమంది కార్మికులు పెన్షన్ తీసుకోకుండానే మృతి చెందారని, తక్షణమే యజమాన్యం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని అన్నారు. అనారోగ్యానికి గురైన కార్మికులకు తక్షణ వైద్యం అందించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ లేదు ప్రభుత్వం చొరవ చూపి ఆసరా పెన్షన్లు అందించాలని కోరారు. జూలై 20 తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్ని కొనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోరంగు పండరి, రవీందర్, ప్రభాకర్, వెంకట్రాం నరసయ్య, నారాయణ, శ్రీను, రవీందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.






