ప్రమాదకరంగా మారిన ధనోర బ్రిడ్జ్
12-09-2026 | 06:27pm
తాంసి/భీంపూర్(విజయక్రాంతి): భీంపూర్ మండలం(Bhimpur Mandal) ధనోర వాగు అంతర్రాష్ట్ర రోడ్డుపై నిర్మించిన బ్రిడ్జి ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాటిలో వర్షపు నీరు నిల్చొని ఉండడంతో కొత్తగా ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాల భారిన పడుతున్నారు. దాదాపు 26 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జిపై నుండి జిల్లా, మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరో పక్క బ్రిడ్జికి సైడ్ వాల్స్ లేకపోవడంతో రాత్రి వేళలో అదుపు తప్పితే వాగులో పడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి పై తాత్కాలిక మరమత్తులు చేపట్టాలని,లేదా కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.