18-07-2025 01:18:25 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి) హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను టీఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. హిమాచల్‌ప్రదేశ్, హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారని కొనియాడారు. దత్తాత్రేయ కిందిస్థాయి కార్యకర్త నుంచి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని, ఆయన సేవలు దేశానికి, తెలుగు రాష్ట్రాలకు ఇంకా అవసరం ఉందని పేర్కొన్నారు.