calender_icon.png 18 July, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషీరాబాద్‌లో కమ్యూనిటీ హాల్‌ల ఆధునీకరణ

18-07-2025 01:18:22 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

ముషీరాబాద్, జూలై 17(విజయక్రాంతి) ముషీరాబాద్ నియోజకవర్గం  ప్రజలకు శుభకార్యాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రతి కాలనీ, బస్తీలలో కమ్యూనిటీ హాల్ ల ను నిర్మిస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం భోలక్పూర్ డివిజన్ లోని పీ అండ్ టీ కాలనీలో రూ.30 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ ముఖద్వార నిర్మాణ పనులకు పూజలు చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్లలో ఉన్న కమ్యూనిటీ హాల్లను ప్రజల అవసరాలకు అనుకూలంగా తీర్చిదిద్ది అందు బాటు లోకి తీసుకువస్తున్నాం అన్నా రు. పీ అండ్ టీ కాలనీ కమ్యూనిటీ హాల్ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని త్వరితగతిన నిర్మా ణ పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కమ్యూనిటీ హాళ్లను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రాజకీయా లకు అతీతంగా అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజా సమస్యలను తీర్చుతున్నామ న్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు.

బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, సీనియర్ నాయకులు బింగి నవీన్, డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, గోవింద్ రాజ్, డివిజన్ బీసీసెల్ అధ్యక్షుడు ఉమాకాంత్, మైనార్టీ కమిటీ రాష్ట్ర నాయకుడు రహీం, డివిజన్ యూత్ కమిటీ అధ్య క్షుడు కె.ఎం సాయి, సోషల్ మీడియా ఇన్చా ర్జి ప్రవీణ్ కుమార్, పీ అండ్ టీ కాలనీ అధ్య క్ష, కార్యదర్శులు రామకృష్ణ, లత తదితరులు పాల్గొన్నారు.