మట్టి గణేశ విగ్రహాల పంపిణీ

10-09-2026 | 10:28pm

నస్పూర్: పర్యావరణ పరిరక్షణ(Environmental protection)లో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేశ విగ్రహాలను కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) గురువారం జిల్లా అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా జలవనరుల కాలుష్యాన్ని నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. రసాయనిక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై గోడ ప్రతులను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు