నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
10-06-2026 01:47 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానక సత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గౌరు రాజయ్యకు రూ.50,000, మానుక కృష్ణవేణికి రూ.17,500, చేకూట దయామణికి రూ.17,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాను కల్పిస్తోందని మానక సత్యం పేర్కొన్నారు.






