10 June, 2026 | 2:21 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు

10-06-2026 01:43 PM

బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గం పరిధిలోని నేరడిగొండ సోనాల బోత్ మండలాలలో ఉన్న మొరం గుట్టలు రాత్రికి రాత్రి కరిగిపోతున్నాయి. రోజంతా ట్రాక్టర్లతో రాత్రిపూట తిప్పర్లతో మొరం తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అక్రమమురం వ్యాపారాన్ని అడ్డుకునే అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.

నేరడిగొండ మండలంలోని . కుమారి పంచాయతీ పరిధిలో నుండి

44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న కుమారి .కుట్టి గ్రామాల పరిసరాలలో ఉన్న ఎర్ర మొరం గుట్టలు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. కొంతమంది కాంట్రాక్టర్లు రాత్రిపూట ఇతర మండలాలకు టిప్పర్లలో తరలించుకుపోయి విక్రయించుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పనులు జరిగిన ఎర్ర మొరం మాత్రం ఇక్కడినుండే తీసుకువెళ్తున్నారు. ఇక బోత్ మండలంలోని పిప్పలదరి పాట్నాపూర్ చింతగూడ గ్రామాల పరిసరాలలో నుండి విచ్చలవిడిగా లోకల్ మొరం తరలించి కు వెళ్తున్నారు.

ఊరు రా మొరం మాఫియా

బోత్ సోనాల నేరడిగొండ మండలాల్లో మొరం మాఫియా రాజ్యమేలుతున్నది. అడ్డు వచ్చిన వారిని నయాన భయాన బెదిరించి వారి చెప్పు చేతుల్లోకి తీసుకుంటున్నారు.వినని వారిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సోనాల మండలంలో నూతనంగా వేరుస్తున్న వెంచర్లకు మొరం తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులకు ఫిర్యాదులు చేస్తే పట్టుకొని కేసులు వేయడంతో మొరం వ్యాపారులు వెనక్కి తగ్గారు.

బోత్ మండలంలోని చింతగూడ పాట్నాపూర్ పోచ్చర కౌట బి గ్రామాలలో మొరం తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. నూతనంగా గెలుస్తున్న వెంచర్లకు ప్రైవేటు భవనాలకు రాత్రికి రాత్రి లోకల్ మొరం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా అధికారులకు తెలిసి జరుగుతుందని స్థానికులు అంటున్నారు.

ఫిర్యాదులు వస్తేనే కేసులు

మొరం అక్రమ తవ్వకాలపై అధికారులకు నేరుగా ఫిర్యాదులు చేస్తేనే కేసులు వేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఆ ఫిర్యాదులు కూడా ఇతర మండలాల నుండి వచ్చి మొరం తవ్వకాలు చేసే వారిపై స్థానికంగా ఉన్న కొంతమంది మొరం వ్యాపారులు ఫిర్యాదులు చేస్తే కేసులు నమోదు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా ఉన్నవారు ఎన్ని రకాల అక్రమ వ్యాపారం చేసిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు.ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉందని విమర్శలు వస్తున్నాయి.