ప్రజల మన్ననలు పొందుతున్న పిల్లుట్ల రఘు సేవలు
నాలుగోసారి ఉచిత వినాయక విగ్రహాల పంపిణీ అభినందనీయం
బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణా నాయక్
గరిడేపల్లి,(విజయ క్రాంతి): ప్రజా సేవే లక్ష్యంగా, పండుగలు సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న బీఆర్ఎస్(BRS) నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు సేవలు అభినందనీయమని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణా నాయక్ అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో పిల్లుట్ల రఘు నాలుగోసారి అందిస్తున్న ఉచిత వినాయక విగ్రహాల(free Ganesha idols) పంపిణీ టోకెన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినాయక చవితి వంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ పండుగలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే మంచి ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా ఉచిత వినాయక విగ్రహాలను అందించడం పిల్లుట్ల రఘు కు ప్రజల పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజలతో మమేకమై, వారి అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రఘు కు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని ఆయన కొనియాడారు.నాలుగో ఏడాది కూడా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఉచిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం గొప్ప విషయమని, ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రజల ఆదరణ, ఆశీస్సులే తనకు బలమనే భావనతో పిల్లుట్ల రఘు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వీరం రెడ్డి, శంబిరెడ్డి, సర్పంచులు బోల్లెపల్లి రామనాథం, సుధా నాగరాజు, మచ్చ మురళి, సందీప్ నాయక్, నాగయ్య సుందరయ్య, నరేందర్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.