విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌ల పంపిణీ
25-08-2026 04:36 PM
గజ్వేల్, ఆగష్టు25: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా లభిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ భవాని కరుణాకర్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచెల్మి స్వామి అన్నారు. 11వ వార్డు పరిధిలోని సంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొలిచెలిమ భవాని కరుణాకర్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచెలిమ స్వామి, ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు వాజిద్, అల్తాఫ్, మోసిన్, ఇక్బాల్, షారుక్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.






