2 June, 2026 | 2:41 AM

వర్గ పోరుతో ఇబ్బందులు సృష్టించొద్దు

02-06-2026 12:04 AM
  1. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి 
  2. హస్తినాపురం డివిజన్ కాలనీల్లో పర్యటన 

ఎల్బీనగర్, జూన్ 1 : ఆయా కాలనీల్లో వర్గ పోరుతో ప్రజలకు ఇబ్బందులు సృష్టించొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు.  హస్తినాపురం డివిజన్ నార్త్ ఎక్స్టెన్షన్ ఫేజ్-2, ద్వారకా తిరుమల కాలనీలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ... ద్వారకా తిరు మల కాలనీ (హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ ఫేజ్-2) కాలనీలోని పార్కు గేటుకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరారు.

కాలనీ పార్కుకు గతంలో ఉన్న గేటుతో కాలనీవాసులందరికీ ఎంతో రక్షణగా, సౌకర్యవంతంగా ఉండేదని, అయితే ప్రస్తుతం కొద్దిమంది  గేటును మూసి వేయాలని అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్కు గేటును ఖచ్చితంగా కొనసాగించాలని కోరారు. పార్కు గేటును తెరిచి ఉంటే వర్షపు నీటి సమస్య లోతట్టు ప్రాంతాలకు వస్తుందని కొందరు, గేటు మూసి ఉంటే వర్షపు నీటిని అడ్డుకుంటుందని మరికొందరు వాదిస్తున్నారు.

కొంతమంది వ్యక్తిగత కారణాలతో వ్యతిరేకిస్తున్నప్పటికీ, అత్యధిక శాతం ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఉన్న విధంగా పార్కు గేటును యథావిధిగా కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న ఎమ్మెల్యే స్పందించారు. స్థానిక  మున్సిపల్ అధికారులతోపాటు ఇరు వర్గాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు.  కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.