2 June, 2026 | 2:43 AM

ఘనంగా టీఆర్‌ఎస్ పార్టీ జెండావిష్కరణ

02-06-2026 12:03 AM

మెదక్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు నరేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని మెదక్ జిల్లాలో ఒక శక్తిగా తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇంచార్జ్ పీ.చంద్రశేఖర్, మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ బట్టి అజయ్, జెండా పండుగ నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గణేష్, టౌన్ టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ కేవల్ నందకిషోర్, స్టూడెంట్ వింగ్ మెదక్ జిల్లా అధ్యక్షులు జునేద్, పిల్లికోటల రమేష్ తదితర జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.