1 May, 2026 | 2:05 AM

పెట్రోలు, డీజిల్‌పై ఆందోళన చెందవద్దు

01-05-2026 12:19 AM

జిల్లా అవసరా లకు తగినంత నిలువలు ఉన్నాయి 

అనవసరంగా కొనుగోలు చేయవద్దు 

కలెక్టర్ మను చౌదరి 

తూముకుంటలో పెట్రోల్ బంకు తనిఖీ 

మేడ్చల్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పెట్రోల్ బంకులలో సరిపడా డిజిల్, పెట్రోలు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ మను చౌదరి అన్నారు.గురువారం శామీర్ పేట్ మండలంలోని తూంకుంటలోని పెట్రోల్ బంకును కలెక్టర్ తనిఖీ చేసారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ డిపోల నుండి సరఫరా కూడా సరిపోయేంత ఉన్నదని వినియోగదారులు సోషల్ మీడియాలో వార్తలు చూసి ఆందోళనకు గురికాకూడదన్నారు. పెట్రోల్ బంకులలో బారులు తీరవద్దని, ఎప్పటికప్పుడు బంకులలో ఇంధనం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వినియోగదారులు వారి అవసరాల మేరకు ఇంధనం కొనుగొలు చేయాలని, ఇంధనం సరఫరా పై  భయాందోళనలు చెందవద్దని సూచించారు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులను బంకు యజమానులు ఇండెంట్ పెట్టిన వెంటనే వారి ఇంధనం సరఫరా అయ్యే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో ఒక్క బంకు కూడా డ్రై అవ్వకుండా చూడాలన్నారు. బంకు యజమానులు చాలా అడ్వాన్సుగా ఆయిల్ కంపెనీలకు ఇంధనం లోడ్ కొరకు ఇండెంట్ పెట్టాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.