15 April, 2026 | 2:59 AM

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వనవాసికి వితరణ

15-04-2026 12:29 AM

విద్యార్థుల్లారా.. దాతల సహకారాన్ని వమ్ము చేయకండి.

విద్యార్ది నిలయ కమిటీ కార్యదర్శి మురళీకృష్ణ

చర్ల, ఏప్రిల్ 14, (విజయక్రాంతి): మారుమూల అటవీప్రాంత గ్రామాలకు చెందిన పేద ఆదివాసీ విద్యార్దుల చదువులకు సహకరిస్తున్న స్దానిక వస్త్ర వ్యాపారి గాదంశెట్టి నరసింహారావు - ప్రసన్నలక్ష్మి దంపతులు అబినందనీయులని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరంభీం విద్యార్ది నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అన్నారు.

నరసింహారావు తండ్రి దివంగత గాదంశెట్టి బాలనర్సింహం వర్థంతి సందర్భంగా వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం, విద్యార్దులకు భోజనం, పండ్లు, స్వీట్స్ అందచేసారు. ఈ సందర్భంగా నిలయ కమిటీ ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మురళీకృష్ణ ప్రసంగించారు.

విద్యార్దుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని గాదంశెట్టి కుటుంబీకులు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ తల్లిదండ్రులు బాలనర్సింహం - సుబ్బలక్ష్మి దంపతుల వర్దంతి, జయంతి సందర్భంగా విద్యార్ది నిలయంకు వితరణలను అందచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుండటం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో కొమరం భీం విద్యార్ది నిలయం సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, నిలయ కమిటీ సభ్యులు పోలిన రమాదేవి, లవన్ కుమార్ రెడ్డి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.