ఎంజాయ్ చేసేలా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

23-09-2026 | 05:25am

ఆర్కా మీడియా వర్క్స్(Arka Media Works), షోయింగ్ బిజినెస్ బ్యానర్ల(Showbiz banners) మీద శోభు యార్లగడ్డ(Shobu Yarlagadda), ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ(SS Karthikeya) నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించారు. ఈ సినిమాతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ‘చిత్రం నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది.

ఈ సినిమా ఆడియెన్స్‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు. ఎస్‌ఎస్ కార్తీకేయ మాట్లాడుతూ.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చాలా కొత్తగా ఉంటుంది. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి మేం కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ సారా తదితర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు