ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ కి స్వల్ప గాయాలు

12-09-2026 | 07:32pm

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని అనంతోగు నుండి కాచినపల్లి  మార్గంలో ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా(tractor overturns) పడింది. ఈ రోడ్డు నిత్యం ప్రమాదాలకు కారణభూతంగా మారింది ఇరుకు రోడ్డు కావడంతో ఎదురుగా వచ్చే వాహనాన్ని చూసే లోపే ప్రమాదాల(Accidents) బారిన పడుతున్నారు ఈ ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయలతో బయటపడటం గమనార్హం. మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆర్ అండ్ బి వారు ఈ ప్రమాదాలు అరికట్టేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు.

మరిన్ని వార్తలు