వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి

10-09-2026 | 04:50pm

మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలి

విద్యుత్‌,  అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

కొల్చారం: వినాయక చవితి వేడుకలను(Vinayaka chavithi celebrations) శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్(DSP Prasanna Kumar) సూచించారు. కొల్చారం మండల(Kolcharam Mandal) కేంద్రంలోని బాబా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వినాయక చవితి శాంతి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వినాయక మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వినాయక చవితి వేడుకలను సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. ఈ సమావేశంలో మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్సై మోహినూద్దీన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, సర్పంచ్లు మధుసూదన్ రెడ్డి, స్వామి, సీనియర్ నాయకులు పుర ప్రభాకర్, అరిగే విజయ్ కుమార్, గుండు నాని, ఆరె రవీందర్, ఆరుట్ల సుధాకర్, పెంటయ్య, మోత్కు మల్లేశం, కన్నెబోయిన మహేష్, ఉషయ్య, అంసన్ పల్లి రమేష్    తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు