డివైఎఫ్ఐ భద్రాచలం పట్టణ నూతన కమిటీ ఎన్నిక
భద్రాచలం ( విజయ క్రాంతి): భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ(Democratic Youth Federation of India) భద్రాచలం పట్టణ నూతన కమిటీ 21 మందితో ఏకగ్రీవంగా ఎన్నికయింది. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన పట్టణ తొమ్మిదవ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా భద్రాచలం పట్టణ డివైఎఫ్ఐ అధ్యక్షురాలిగా బిన్నీస్వరూప ప్రధాన కార్యదర్శిగా సండ్ర భూపేంద్ర కోశాధికారిగా వాగ్దాని మురళీకృష్ణ లను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది.
వీటితోపాటు సహాయ కార్యదర్శిగా ఆర్ అర్చన ఉపాధ్యక్షురాలుగా గౌతమి మరో సహాయ కార్యదర్శిగా సాయికిరణ్ లతోపాటు 21 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పట్టణ కార్యదర్శి సండ్ర భూపేంద్ర మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనంతరం యువజన ఉద్యమంలో బాధ్యతలను చేపట్టడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.