భీక్యాతండలో సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే పద్మావతి
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ బాణోతు బాలాజీ ఝాన్సీ
కోదాడ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): భీక్యాతండలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. మంగళవారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన అనంతరం గ్రామంలో సమస్యలను సర్పంచ్ బాణోతు బాలాజీ ఝాన్సీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే పద్మావతిరెడ్జికి వివరించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, పనులు పూర్తిచేయిస్తానని తెలిపారు. ఈ నెలాఖరు లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు కరెంట్ మంజూరు చేయిస్తానన్నారు. సర్పంచ్ బాణోతు బాలాజీ ఝాన్సీని ఎమ్మెల్యే పద్మావతి ఆప్యాయంగా పలుకరించి దగ్గరకు తీసుకున్నారు. అన్ని పనులు తప్పకుండా చేయిస్తానని హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు శరభేశ్వరరావు, డీలర్ గుగులోతు కైక, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.