తమ్ముడ్ని పొడిచి చంపిన అన్న
21-09-2026 | 05:00am
ఆస్తి తగాదానే కారణం
మహబూబాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆస్తి తగాదాల(Property disputes) నేపథ్యంలో తమ్ము డ్ని అన్న కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన వరంగల్ నగర(Warangal city) పరిధిలోని గరీబ్ నగర్లో శనివారం రాత్రి జరిగింది. ఎలుబాక ప్రవీణ్(Elubaka Praveen), ప్రసాద్(Prasad) అన్నాదమ్ములు. ఓ ఫ్లాట్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో ప్రవీణ్.. తమ్ముడు ప్రసాద్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ సంఘటనపై గీసుకొండ సీఐ(Geesukonda CI) విశ్వేశ్వర్ దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా ప్లాట్ విషయంలో గొడవ జరుగుతోందని, ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని తమ్ముడిపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.