టీజీఎస్ ఆర్టీసీలో ఎన్నికల సందడి

24-09-2026 | 05:20am
  1. నేటి నుంచి ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి..
  2. పదేళ్ల తర్వాత ఎన్నికలు 
  3. ప్రతిష్టాత్మకంగా కార్మిక సంఘాల ఎలక్షన్స్

నిర్మల్ సెప్టెంబర్ 23 ( విజయక్రాంతి): టిజీ ఆర్టీసీ(TG RTC)లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల(Identity associations)కు ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ప్రకటించడం ఆది నేటి నుంచి అమలు కానుంది. టిజీ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు(TG RTC Recognized Union Elections) అప్పటి తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana)  2014 అక్టోబర్ 9న నిర్వహించగా ఆ తర్వాత కెసిఆర్(KCR) ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలను రద్దు చేసింది. అప్పటినుంచి టీజీ ఆర్టీసీ కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు.

2023లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల కు ఇచ్చిన హామీల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా ప్రధానమైంది. దీంతో కార్మిక శాఖ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఐదు డిపోలో పరిధిలో ఎన్నికల షెడ్యూలు తేదీలను ఖరారు కావడంతో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో కొనసాగనుంది. 

షెడ్యూలు ఇదే 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల టీజీ ఆర్టీసీ రీజియన్ పరిధిలో నిర్మల్, బైంసా , ఉట్నూర్, అదిలాబాద్ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్ డిపోలు ఉన్నాయి. ఈ ఐదు డిపోల పరిధిలో మొత్తం  2,200 ఓటు హక్కు వేయనున్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామికులు, గ్రేడ్ త్రీ వరకు ఉన్న ఉద్యోగులు ఆర్టీసీ గుర్తింపు సంఘానికి రాష్ట్ర స్థాయిలో డిపో స్థాయిలో వేరువేరుగా రెండు ఓట్లను వేయనున్నారు. 2016లో ఎన్నికలు జరగగా సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ టీజీ ఆర్టీసీలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో కార్మిక సంఘాల నేతలు ఎన్నికల్లో ఉత్సాహంగా ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో టి జి ఆర్ టి సి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఎంప్లాయిస్ ఫెడరేషన్, గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో నిలువనున్నట్టు ఆర్టీసీ కార్మికుల నేతలు చెప్తున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితేనే సంఘం ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఆర్టీసీ పరిరక్షణ. ప్రధాన డిమాండ్లపై సంఘం ద్వారా ప్రభుత్వం పైకి ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి జరగనుంది.

ప్రస్తుతం సంఘాల ఎన్నికలు జరగకపోవడంతో ఆర్టీసీలో సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర జాప్యం జరిగి ఉద్యోగులకు నష్టం జరిగిందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో గుర్తింపు సంఘాలు ఎన్నికల బరిలో నిలబడి విజయం కోసం ఇప్పటినుండి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

షెడ్యూలు అమలు 

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో టీజీ ఆర్టీసీకి జరగనున్న గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ కార్మిక శాఖ ప్రకటించిన విషయం తెలిసింది. మంగళవారం రీజియన్ పరిధిలోని ఐదు డిపోలో ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. 24న ఓటర్లు జాబితాలో అభ్యర్థి వాళ్లపై ఫిర్యాదులు స్వీకరించరున్నారు. 25న ఫిర్యాదుల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. 26న పోటీ చేసే గుర్తింపు సంఘాలకు గుర్తుల కేటాయింపు పై సమావేశం ఉంటుంది.

29న డిప్యూటీ ఎలక్షన్ అధికారుల సమక్షంలో డమ్మీ బ్యాలెట్ పత్రాలను ఇవ్వనున్నారు. అక్టోబర్ 9న పోటీ చేసే కార్మిక సంఘాల ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. 17న ఎన్నికల్లో ఓట్లు వేసిన ఫలితాలను లెక్కింపు ద్వారా ప్రకటించనున్నారు.

డిపో పరిధిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోస్టులు ఉండగా రాష్ట్రస్థాయిలో కూడా మరో ఓటు హక్కు ద్వారా గుర్తింపు సంఘం ఎన్నికల పదవులు దక్కలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని డిపోలో ఇప్పటికే పోటీ చేసే కార్మిక సంఘాల నేతలు డిపో మీటింగ్లు పోస్టర్లు సంఘం యొక్క ప్రాధాన్యత కరపత్రాలు తయారుచేసి తమ అదృష్టాన్ని పరీక్షించునున్నారు 

రెండు సంఘాల మధ్య ప్రధాన పోటీ. 

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రీజియన్ పరిధిలో ప్రధానంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఎంప్లాయిస్ యూనియన్ (ఈ యు) మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించగా ఎంప్లాయిస్ యూనియన్ కూడా కొన్ని డిపోల్లో గట్టి పోటీ ఇవ్వడంతో ఎన్నికలను రెండు కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకురనున్నాయి. ఆయా సంఘాల మేనిఫెస్టోను కూడా ఇప్పటికే గుర్తింపు సంఘాలు ప్రకటించుకొని ఉద్యోగుల ఓట్లను రాబట్టుకునేందుకు జిల్లా రాష్ట్రస్థాయి రెసిడెన్ స్థాయి నేతలు ప్రచారాన్ని కూడా చేపడుతున్నారు. 

గుర్తింపు సంఘం ఎన్నిక ద్వారానే సమస్యల పరిష్కారం 

టీజీ ఆర్టీసీలో పదేళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికలను కచ్చితంగా నిర్వహించాలని ఎన్నోసార్లు టీఎంయూ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేయడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికలను రద్దు చేయగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిధిలో టీఎంయూ విజయ డంక మోగించేందుకు ఇప్పటికే గేట్ మీటింగ్లను చేపట్టినం. 

- ఆర్ గంగాధర్. టీఎంయూ రీజియన్ కార్యదర్శి 

ఆర్టీసీ పరిరక్షణ తమ లక్ష్యం 

టీజీ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో ఎంప్లాయిస్ యూనియన్ గట్టిగా పోరాడుతుంది. ఆర్టీసీ సంరక్షణ, ప్రైవేటీకరణ వ్యతిరేకత, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంప్లాయిస్ యూనియన్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. అన్ని డిపోల పరిధిలో ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల మేనిఫెస్టో పై కరపత్రాలు రూపొందించి ప్రచారాన్ని కూడా చేపడతాం.

- రమేష్ ఈ యు జిల్లా కార్యదర్శి 

మరిన్ని వార్తలు