ఏమో ఏమో ఇది..
30-09-2026 | 05:20am
రోషన్ మేకా(Roshan Meka), ప్రీతి ముకుందన్(Preethi Mukundhan) జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఏమో ఏమో ఇది’. శైలేష్ కొలను రచనాదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ‘ఏమో ఏమో ఇది..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. నాయకానాయికలు రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ మధ్య కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. కార్తీక్, రమ్య బెహరా పాడారు. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.