పీసీసీ ప్రధానకార్యదర్శిగా ఏనుగు జంగారెడ్డి
- పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిసి పుష్పగుచ్ఛం
అందజేసి కృతఙ్ఞతలు తెలియజేసిన జంగారెడ్డి
కందుకూరు,జూన్ 10 : టిపిసిసి ప్రధానకార్యదర్శిగా ఏనుగు జంగారెడ్డిని నియమిస్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానకార్యదర్శిగా ఎంపికైన జంగారెడ్డి మంగళవారం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహా రెడ్డితో కలసి పుష్పగుచ్ఛం అందజేసి కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శిగా తనపై నమ్మకముంచి పదవి కట్టబెట్టినందుకు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి,మంత్రులకు,జిల్లా పార్టీ అధ్యక్షుడికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.
తన రాజకీయ జీవితం చిన్న నాటి మొదలు పెట్టి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ సర్పంచ్ గా,ఎంపిటిసిగా,మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ గా,పార్టీలో పలు రకాల పదవుల్లో కోనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని ఆయన పేర్కొన్నారు.నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను అధికారులకు,పార్టీకి చేరవేస్తు సమస్యలపట్ల పోరాటం చేసి సాధ్యమైనంతవరకు తీర్చేవాడినని తెలిపా రు.
కందుకూరు,మహేశ్వరం మండలాల్లో ఉన్న పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజాసమస్యలు తెలుసుకునేవాడినని,నాశ్రమను గుర్తించి నాకు పార్టీ రాస్ట్ర భాద్యతలు కట్ట బైట్టీనందుకు పార్టీకి ఎల్లవేళలా ఋణపడి ఉంటాననిఆయనఅన్నారు.






