పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ

08-09-2026 | 07:43pm

మున్సిపల్ వైస్  చైర్మన్ డాక్టర్ అనిత 

కాగజ్ నగర్,(విజయక్రాంతి): మొక్కల పెంపకంతో పర్యావరణం   పచ్చగా ఉండి, పర్యావరణం  పరిరక్షించబడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్  డాక్టర్ కొత్తపల్లి అనిత(Municipal Vice Chairman Dr. Anita) అన్నారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్  మున్సిపాలిటీ పరిధిలోని 29 వ వార్డు లో పర్యావరణ పరిరక్షణ- పట్టణ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా  వార్డు ప్రజలతో  కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో రోజురోజుకీ వాతావరణం వేడెక్కుతున్న ప్రస్తుత తరుణంలో మొక్కలు నాటాల్సిన   బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని  డాక్టర్ అనిత  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్  సభ్యులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, మున్సిపల్ శాలరీ  ఇన్స్పెక్టర్  శంకర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు