24 February, 2026 | 8:26 PM

బాల్యవివాహాలు, పిల్లల అక్రమ దత్తత నిర్మూలన

24-02-2026 06:26 PM

వేములపల్లి,(విజయక్రాంతి): బాల్యవివాహాలు, పిల్లల అక్రమ దత్తత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిడిపిఓ చంద్రకళ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కన్వర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని వివిధ శాఖలకు చెందిన ప్రతి అధికారి బాల్యవివాహాలు పిల్లల అక్రమ దత్తత వల్ల జరిగే నష్టాలను గ్రామ ప్రజలకు తమ తమ అధికారులకు వివరించి వాటి నిర్మూలనకు కృషి చేసే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి తాసిల్దార్ హేమలత ఎస్సై వెంకటేశ్వర్లు ఎం పి ఓ లలిత ఏపిఓ శ్రీనివాసరెడ్డి సిహెచ్ఓ ప్రవీణ్ ఐకెపిసిసి గోపి సూపర్వైజర్ రజిని అంగన్వాడీ టీచర్స్ జయమ్మ రజిత తదితరులు పాల్గొన్నారు