రాష్ట్రంలో 21 పీఎస్‌పీల ఏర్పాటు!
- పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల సామర్థ్యం 26,250 మెగావాట్లు
- వివిధ దశల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
- ములుగు జిల్లాలోనే 10,760 మెగావాట్ల సామర్థ్యం ఉన్నట్టు గుర్తింపు
- తాజా ప్రతిపాదనలోనే 16 ప్రాజెక్టులు
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ అవసరాలకు సరిపోయేలా విద్యుత్తును ఉత్పత్తి చేయడంతోపాటు మిగులు విద్యుత్తు దిశగా సాగాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్(Pumped Storage Hydropower Project)లపైకూడా ముందుకు సాగుతున్నది.
థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుతో కాలుష్యం, పర్యావరణానికి కాస్త ఎక్కువగా ముప్పు ఉన్న నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వరకు పీఎస్‌పీల ఏర్పాటుకు అవకాశం ఉన్నదనే సమాచారాన్ని సేకరించి సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ (సీఈఏ)కు సమాచారాన్ని అందించారు.
ఇలా మొత్తం 21 పవర్ ప్లాంట్లకు అవకాశం ఉన్నదని వీటి సామర్థ్యం మొత్తం 26,250 మెగావాట్లుగా సీఈఏ కూడా తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఇందులో 5 పీఎస్‌పీ లు (ఇప్పగూడెం, రాణాపూర్, గ్రీన్‌కో టీఎస్ 01, ఆస్తా తెలంగాణ, సెరూలియన్, 2023లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టకము ందే సీఈఏకు ప్రతిపాదనలు అందాయి. 2023 డిసెంబరులో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభు త్వం.. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లపై దృష్టి సారించింది.
దీంతో ఎక్కడెక్కడ పీఎస్‌పీలకు అవకాశం ఉందనేదానిపై తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే చేయించారు. తరువాత మొత్తం 16 ప్రాంతాల్లో పీఎస్‌పీలకు అవకాశం ఉందని భావించిన ప్రభు త్వం తాజాగా (2026 జూలై) సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటికి ప్రతిపాదనలు పంపిం చింది. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ) టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్‌ఆర్) నివేదికలను తయారుచేస్తోంది.
ములుగు జిల్లాలోనే 10 వేల మెగావాట్లకుపైగా
రాష్ట్ర వ్యాప్తంగా పీఎస్‌పీ ప్లాంట్లను నిర్మి ంచేందుకు అనువైన ప్రాంతాలు గుర్తించిన ప్రభుత్వం.. ఇందులో ఒక్క ములుగులోనే సుమారు 10,760 మెగావాట్ల సామర్థ్యం ఉందని గుర్తించింది. వాస్తవానికి రాష్ట్రంలోనే అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ 3,960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించవచ్చని అదికూడా ములుగు జిల్లాలోని ఇప్ప గూడెం వద్ద అవకాశం ఉందని గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారు. దీనికి 2023 జూలైలోనే టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కూడా జారీచేశారు. దీంతోపాటు కోయబె స్తగూడెం వద్ద మరో 3600 మెగావాట్ల సా మర్థ్యంతో, అలుబాక వద్ద 2000 మెగావా ట్ల సామర్థ్యంతో, చాలమల్లు వద్ద 1200 మె గావాట్ల సామర్థ్యంతో మొత్తం.. 10760 మె గావాట్ల సామర్థ్యంతో పీఎస్‌పీలను నిర్మించే ందుకు అనుకూలంగా ఉందని గుర్తించారు.
కాలుష్యం తగ్గుముఖం
నిజానికి ఈ ప్రతిపాదనలన్నీ పట్టాలెక్కి విద్యుత్తును ఉత్పత్తి చేసే దశకు చేరుకుంటే రాష్ట్రంలో విద్యుత్తు ద్వారా విడుదలయ్యే కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుందని విద్యుత్తు శాఖ ఇంజినీర్లు భావిస్తున్నారు. పంప్డ్ స్టో రేజీ పవర్ ప్లాంట్ల వల్ల అధిక విద్యుత్తు డిమా ండ్ ఉన్న సమయంలో గరిష్టంగా పీఎస్‌పీలను నడిపించడం ద్వారా తక్కువ ఖర్చుతో విద్యుత్తును పొందవచ్చు.
అలాగే బహిరంగ మార్కెట్‌లో చాలా తక్కువ ధరకు విద్యుత్తు లభిస్తున్నప్పుడు ఆ విద్యుత్తును వినియోగించి దిగువన ఉన్న జలాశయం నుంచి నీటి ని రివర్స్ పంపింగ్ విధానంలో ఎగువన ఉ న్న రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయవచ్చు. దీనివల్ల విద్యుత్తు కొనుగోలు చాలా తక్కువ అవుతుంది. అదీగాక పీఎస్‌పీలను గణనీయంగా వినియోగించుకుంటే థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వెలువడే బూడిద, పొగలాంటి కాలుష్యాలను చాలా వరకు అరికట్టవచ్చు. ప్రస్తుతానికి ఐదు పీఎస్‌పీలకు సంబంధించి మాత్రమే ముందుకు సాగుతున్నాయి.
మిగిలిన 16 ప్రాజెక్టులకు సంబంధి ంచి కేవలం ప్రతిపాదనలు మాత్రమే సీఈఏకు చేరాయి. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి టీవోఆర్‌లు రిలీజ్ అయిన తరువాత వీటిని తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో సొంతంగానే చేపడతారా లేక టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారా అనేది తేలుతుంది. ప్రస్తుతానికి మా త్రం తెలంగాణ జెన్‌కో డెవలపర్‌గా ఉన్నట్టుగా సీఈఏ పేర్కొంది. వీటన్నింటినీ వీలైన ంత తక్కువ సమయంలో పూర్తి చేయగలిగితే తెలంగాణ పీఎస్‌పీలో అగ్రస్థానంలోకి దూ సుకెళ్ళడం ఖాయంగా కనపడుతోంది.
