నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల రాజేందర్
హైదరాబాద్: మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం నాడు కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ముందు హాజరు కానున్నారు. బీఆర్కే భవన్ లో కాళేశ్వంరం కమిషన్ విచారణకు ఉదయం 11 గంటలకు ఈటల హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ఈటల రాజేందర్(Eatala Rajendar) ను ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం రీ-ఇంజినీరింగ్, డిజైన్, నిధుల విడుదల, కాళేశ్వరంపై కేబినెట్ ఆమోదం సహా అనేక అంశాలపై ప్రశ్నించే అవకాశముంది. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జూన 9న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) హాజరు కానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటివరకు 109 మందిని ప్రశ్నించింది.






