హిందీ భాషను ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి ఎంఈఓ నాగయ్య

22-09-2026 | 09:52pm

మూసాపేట్ /సెప్టెంబర్ 22: మూసాపేట్ మండల పరిధిలోని పోల్కంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Polkampally Zilla Parishad High School) హిందీ  దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం విద్యార్థుల చేత హిందీ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగయ్య మాట్లాడుతూ హిందీ రాష్ట్ర భాష ప్రముఖ భాష అని ఇది సరళమైన భాషా అని తెలిపారు. భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష అని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధతో ఆసక్తితో నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డాన్స్, కవిత్వం ఉపన్యాసాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు