దాండియా నైట్‌కు మల్లారెడ్డికి ఆహ్వానం
జవహర్ నగర్, అక్టోబర్ 4(విజయక్రాంతి) : జవహర్‌నగర్‌లో(Jawaharnagar) అక్టోబర్ 10న నిర్వహించనున్న దాండియా నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బాషవోని కొండల్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని బాషవోని నితిన్ ముదిరాజ్, ఆయన స్నేహితులు కలిసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాండియా నైట్‌లో సంగీతం, నృత్యాలతో సందడి నెలకొననుందని, కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అల్లూరి సంగీత రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి పల్లపు రవి మరియు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.