అశోక్ సింఘాల్ చిరస్మరణీయుడు

04-10-2026 | 10:13pm

- పీహెచ్ పీ పోరాటంతో రామాలయం సాకారం 

- మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి 

- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

- సనాతాన ధర్మంతోనే సర్వే జనః సుఖినోభవంతు 

- రామ మందిర్ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్

- ఘనంగా అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాలు 

ఎల్బీనగర్, అక్టోబర్ 4 : విశ్వహిందూ పరిషత్ నాయకుడు(Vishwa Hindu Parishad leader) స్వర్గీయ అశోక్ సింఘాల్(Ashok Singhal) చిరస్మరణీయుడని, ఆయన చేసిన కృషితోనే అయోధ్యలో(అయోధ్య) రామాలయ(Ram Mandir) నిర్మాణానికి మార్గం పడిందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఎల్బీనగర్ లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ సమీపంలోని ఒక  కన్వెన్షన్ హాల్ లో ఆదివారం స్వర్గీయ అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ జన్మ శతజయంతి ఉత్సవాల రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ మందిర్ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు.

వివిధ సాధువుల సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి, హిందూ సమాజంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సింఘాల్ తీవ్రంగా కృషి చేశారన్నారు.  రామజన్మభూమి ఉద్యమాన్ని, వైదిక వారసత్వాన్ని పరిరక్షించడం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించేందుకు అశోక్ సింఘాల్ 'రామజన్మభూమి ఉద్యమాన్ని' ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగించుకున్నారని  గుర్తు చేసుకున్నారు.

సిక్కులు, బౌద్ధులు సనాతన హిందూ సమాజంలో భాగమని అశోక్ సింఘాల్ అన్నారని పేర్కొన్నారు. రామజన్మభూమి ఉద్యమ రోజుల నుంచి సింఘాల్ కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత బంధాన్ని గుర్తుచేసుకున్నారు.  భారతదేశంలోని మూడు లక్షల గ్రామాల్లో రామాలయం, హిందువుల ఐక్యతపై అవగాహన కల్పించి, ప్రజలను సమీకరించడానికి సింఘాల్ రామ జన్మభూమి ఉద్యమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని, ఇది దేశంలో అపూర్వమైన ప్రజా సమీకరణ అని అన్నారు.

వివిధ వర్గాలకు చెందిన అనేక మంది సాధువులను, మత నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సింఘాల్, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారు. తాను మత, రాజకీయ నాయకులను రామజన్మభూమి ఉద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారని అన్నారు. 1989 నవంబర్ 9న అయోధ్యలో బీహార్‌కు చెందిన షెడ్యూల్డ్ కుల కార్యకర్త కామేశ్వర్ చౌపాల్ నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో సింఘాల్ కీలక పాత్ర పోషించారని చంపత్ రాయ్ గుర్తుచేసుకున్నారు.

హిందువులను, బౌద్ధులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సింఘాల్ తీవ్రంగా కృషి చేశారు. సింఘాల్ ఆహ్వానం మేరకు, టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా 2001లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు. అక్కడ, కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్యులు, ఇతర సన్యాసులు దలైలామాతో కలిసి కూర్చుని హిందూ ఐక్యతపై ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశారని గుర్తుచేసుకున్నారు.

కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నారాయణఖేడ్ హనుమాన్ దీక్ష పీఠాధిపతి సంగ్రాం మహారాజు, మేడిపల్లి లోని మాత అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం, వివేకానంద అనాథ రోగుల ఆశ్రమ వ్యవస్థాపకులు దుర్గానందపురి స్వామీజీ, చంపత్ రాయ్, ఆచార్య ప్రొఫెసర్ ఆరేకంటి కృష్ణయ్య, పీహెచ్ టీ తెలంగాణ అధ్యక్షుడు భోజనపల్లి నరసింహా మూర్తి, పీహెచ్ పీ మాస్ పత్రిక ఎడిటర్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పీహెచ్ పీ నాయకులు యక్కలి రాఘవులు, గుమ్మల సత్యం జీ,  భాస్కరరావు,  కైలాస్ నారాయణ బాంగ్డియా, డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర రాజు, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, పీహెచ్ పీ, బీజేపీ నాయకులు, వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు