1 April, 2026 | 7:13 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

ఫ్లుఓవర్‌పై బాంబు ఉందని ఫేక్‌కాల్

27-09-2024 02:23 AM

నిందితుడి అరెస్టు 

కార్వాన్, సెప్టెంబర్26 : లంగర్‌హౌస్ ఫ్లుఓవర్ వద్ద బాంబు ఉందని డయల్ 100కు ఫేక్‌కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన వివరాలు.. ఈనెల 24న రాత్రి లంగర్‌హౌస్ ఎంప్లాయ్ బాగ్దాద్ కాలనీకి చెందిన అబ్దుల్ ఇమ్రాన్ తన భార్యతో గొడవపడ్డాడు. అయితే తాగిన మైకంలో ఇమ్రాన్  రాత్రి 10:50 గంటలకు లంగర్‌హౌస్‌లోని ఇంద్రారెడ్డి ఫ్లుఓవర్‌పై కొందరు బాంబు పెట్టారని 100కు కాల్ చేసి చెప్పాడు. పోలీసులు ఫ్లుఓవర్ వద్ద తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు లభించలేదు. అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. సెల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.