ఇయ్యాల్నే రైతు భరోసా... మోతమోగనున్న రైతుల సెల్‌ఫోన్లు
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద జూన్ 30 నుంచి నిధుల విడుదల ప్రారంభించింది. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
📌 రైతు భరోసా 2026 ముఖ్యాంశాలు
✔ ప్రారంభ తేదీ: జూన్ 30, 2026
✔ లబ్ధిదారులు: 41.37 లక్షల మంది రైతులు
✔ మొత్తం నిధులు: రూ.2,482.02 కోట్లు
✔ ఎకరం వరకు: రూ.878.94 కోట్లు
✔ 2 ఎకరాల వరకు: రూ.1,603.08 కోట్లు
✔ పంపిణీ విధానం: నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తెలిపారు. మంగళవారం ఖరీఫ్ సీజన్ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు భరోసాతో రైతుల్లో విశ్వాసం పెంచుతున్నామని తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు(Rythu Bharosa funds) దశలవారీగా జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లోకి 9 వేల కొట్ల పంపిణీ చేయనుంది.
తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 30 నుంచి 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభను( Rythu Ashirvada Sabha) రద్దు చేసన ప్రభుత్వం హైదరాబాద్ కు మార్చింది. రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నేటి నుంచి 10 రోజుల్లో రైతుభరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం 30-06-2026 సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికగా ప్రారంభం కానుంది. ఇయాలనుంచి రైతలు సెల్‌ఫోన్లు మోత మోగనున్నాయి.
నేడు 2 ఎకరాల వరకు రైతు భరోసా
మొదటి రోజే రూ.2,482.02 కోట్లు
41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ
ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు
ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు
రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి?
తెలంగాణ ప్రభుత్వం జూన్ 30, 2026 నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభించింది. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
రైతు భరోసా 2026లో ఎంత మొత్తం విడుదల అవుతోంది?
మొత్తం రూ.9,000 కోట్లను దశలవారీగా ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి రోజే రూ.2,482.02 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
రైతు భరోసా అర్హులు ఎవరు?
భూమి వివరాలు నమోదై ఉన్న అర్హులైన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయి.
FAQ's
Q1. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి?
జూన్ 30, 2026 నుంచి దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
Q2. మొదటి విడతలో ఎంతమంది రైతులు లబ్ధి పొందుతున్నారు?
41.37 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
Q3. తొలి రోజే ఎంత మొత్తం విడుదల అవుతోంది?
రూ.2,482.02 కోట్లు విడుదల చేస్తున్నారు.
Q4. 2 ఎకరాల రైతులకు ఎంత మొత్తం కేటాయించారు?
రూ.1,603.08 కోట్లు కేటాయించారు.
Q5. రైతు భరోసా డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి?
బ్యాంక్ ఖాతా SMSలు, అధికారిక పోర్టల్ లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
Related Articles
రైతు భరోసా పథకం పూర్తి అర్హతలు, అవసరమైన పత్రాల వివరాలను మా "రైతు భరోసా గైడ్" ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
తెలంగాణలో తాజా వర్షాల పరిస్థితులు, ఎల్లో అలర్ట్ జిల్లాల వివరాల కోసం "ఆరు రోజులు వర్షాలే" కథనాన్ని చదవండి.
పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలపై పూర్తి వివరాలు మా వ్యవసాయ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.






