బాధ్యులపై చర్యలు ఉంటాయి

03-10-2026 | 05:58pm

 రైతు మృతి బాధాకరం 

 కోయిలకొండ తాహసిల్దార్ దీపక్ రావు 

కోయిల్ కొండ  : కోయిల్‌కొండ తహశీల్దార్ కార్యాలయ(Koilkonda Tahsildar Office) ఆవరణలో శనివారం పార్పల్లి గ్రామానికి(Parpalli village) చెందిన రైతు పసుల లావప్ప(Farmer Pasula Lavappa) (50) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటనపై తహశీల్దార్ జి. దీపక్‌రావు(Tahsildar G. Deepak Rao) వివరణ ఇచ్చారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఘటనపై సమాచారం అందడంతో ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి(Mahabubnagar Government Hospital) తరలించినట్లు పేర్కొన్నారు.

భూ వివాదంపై విచారణ: పార్పల్లి శివారులోని సర్వే నంబర్ 211లోని వ్యవసాయ భూమికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు మృతుడి కుమారుడు పసుల కురుమూర్తి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తహశీల్దార్ తెలిపారు. కొందరు వ్యక్తులు భూమిలోకి ప్రవేశించి హద్దు రాళ్లు తొలగించేందుకు ప్రయత్నించడం, పంటకు నష్టం కలిగించడం, తన తండ్రిపై దాడికి ప్రయత్నించి బెదిరింపులకు పాల్పడినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వివరించారు.

రెవెన్యూ రికార్డుల పరిశీలన: సర్వే నంబర్ 211కు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్లు తహశీల్దార్ తెలిపారు. 1954–55 ఖస్రా పహాణీ ప్రకారం 18.39 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు నమోదు కాగా, క్షేత్రస్థాయి పరిశీలనలో 17.39 ఎకరాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అయితే సంబంధిత సర్వే నంబర్‌లోని భూమితో మృతుడికి ఎలాంటి సంబంధం లేదని తహశీల్దార్ స్పష్టం చేశారు.

మృతుడు రాసినట్లు పేర్కొంటున్న సూసైడ్ నోట్‌లో కొందరి పేర్లు ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిపారు. నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, పోస్టుమార్టం నివేదిక, రెవెన్యూ రికార్డులు తదితర ఆధారాలను పరిశీలించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని తహశీల్దార్ దీపక్‌రావు వెల్లడించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు