సన్న రకాల వరి సాగుపై రైతులకు అవగాహన

22-09-2026 | 08:51pm

కోనరావుపేట సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఆత్మ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో నిమ్మపల్లి రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ కమ్మరి స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సన్న రకాల వరి సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి విధానాలు, ధాన్యం కొనుగోలులో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ సాయికుమార్‌ రైతులకు పలు సూచనలు చేశారు.సన్న రకాల వరి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.ఈ 

కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ చేపూరి గంగాధర్‌, భూక్యారెడ్డి తండా సర్పంచ్‌ నరేష్‌ నాయక్‌, ఏఈఓ అనుముల సహజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు