విద్యుత్ కోతలపై కన్నెర్ర
కామారెడ్డిలో రోడ్డెక్కిన రైతులు
ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం
కామారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కామారెడ్డి జిల్లా(Kamareddy District) పాల్వంచ మండలం ఆరేపల్లి రైతులు, లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి రహదారిపై బుధవారం బైఠాయి ంచారు. పాల్వంచ వద్ద సిరిసిల్ల రహదారిపై ఆరేపల్లి రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు సక్రమంగా రావడం లేదని, దీంతో పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు వల్లే విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండితే దిగుబడి సరిగా రాక తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని రైతులు భీష్మించుక్కూర్చున్నారు. దీంతో విద్యుత్ శా ఖ డీఈ, ఏఈ లు రైతుల వద్దకు వచ్చి గురువారం నుంచి నిరంతరంగా విద్యుత్ సరఫ రా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆం దోళన విరమించారు.