26 August, 2026 | 7:00 PM

పారిశుద్ధ కార్మికులకు సన్మానం

26-08-2026 06:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య సిబ్బందిని బుధవారం ఘనంగా సన్మానించారు. పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న కత్తి భూమవ్వ, దర్శనం లక్ష్మి, బర్కుంట పోసవ్వలను లయన్స్ జోన్ చైర్మన్ కె. చంద్రమోహన్ రెడ్డి, క్లబ్ సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్  సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.