04-02-2026 11:39:49 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్(Moinabad) మండల శివారులో దారుణం చోటుచేసుకుంది. మహిళా న్యాయవాది హత్యకు గురైంది. యువ న్యాయవాది స్వప్న మృతదేహాన్ని పొలం వద్ద గుర్తించారు. దుండగలులు న్యాయవాది స్వప్నను మెడపై నరికి హత్యచేశారు. చేవెళ్ల కోర్టులో స్వప్న ప్రాక్టీస్ చేస్తోంది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు న్యాయవాది హత్యపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.