బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
22-09-2026 | 11:41pm
బేల సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఆపదలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసినా, ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నారని సమాచారం అందినా వారి నివాసాలకు వెళ్ళి కొండంత అండగా నిలబడతారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి(Kandi Srinivasa Reddy). మంగళవారం బేల మండలం సిర్సన్న గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆకాశ్ బాబ్డే నివాసాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు.