6 July, 2026 | 10:24 AM

అంబర్‌పేటలో అగ్నిప్రమాదం

15-08-2024 02:58 PM

హైదరాబాద్: అంబర్‌పేటలోని అలీ కేఫ్ సమీపంలోని పెయింటింగ్ కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంపెనీ పక్కనే నివాసముంటున్న ఓ మహిళ గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.