4 September, 2026 | 1:01 PM

ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం

07-06-2024 | 02:27am

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి) : నాంపల్లి పటేల్ నగర్‌లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఫర్నిచర్ గోదాంలో మంటలు చేలరేగడంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదం వల్ల లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులుల దర్యాప్తు చేపట్టారు.