4 September, 2026 | 1:54 PM

నేటి నుంచి మళ్లీ ప్రజావాణి

07-06-2024 | 02:26am

హైదరబాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ విషయం ప్రజావాణి ఇంచార్జి,  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో  ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా పడిందన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా తెలియచేయా లన్నారు.  ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.