4 September, 2026 | 1:25 PM

ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

04-09-2026 | 12:19pm

బోథ్. సెప్టెంబర్ 4. (విజయ క్రాంతి): తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు సెక్ సాకీర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని అయితే చూసి ఓర్వలేక బి ఆర్ ఎస్ నాయకులు(BRS leaders) ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ధర్నా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.

పేదలకు రేషన్ కార్డులు(Ration Cards), ఇండ్లు, రైతులు పండించిన పంటల కొనుగోలుతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి చర్యలు తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్నాయి అన్నారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు దీవిస్తారన్నారు