పాల్వంచలో అగ్నిప్రమాదం

20-09-2026 | 07:49pm

ఒక ఇల్లు దగ్ధం..

రూ 10 లక్షల ఆస్తి నష్టం 

పాల్వంచ సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలోని కనక వాగులో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మహమ్మద్ ముబీన్ కు చెందిన ఇంట్లో ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లోని వారంతా భయంతో బయటికి పరుగులు తీశారు. 

మంటలు ఎగిసిపడుతుండటం గమనించారు. సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో కొత్తగడం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే లోపు సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యా. వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే మోబిన్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఇద్దరి ఎంబీఏ సర్టిఫికెట్లు వెల్డింగ్ సామానుతో పాటు కూతురు వివాహం కొరకు కొనుగోలు చేసిన బట్టలు సామాన్లు టైలరింగ్ వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు.

మరిన్ని వార్తలు