రాజన్న ఆలయంలో అగ్నిమాపక మాక్‌డ్రిల్
సిబ్బందికి ప్రత్యక్షంగా అవగాహన కల్పించిన అధికారులు
వేములవాడ, సెప్టెంబర్4, (విజయక్రాంతి): అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో భక్తులు, సిబ్బంది రక్షణపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం(Sri Raja Rajeshwara Swamy Devasthanam)లో శుక్రవారం అగ్నిమాపక శాఖ ఆధ్వ ర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్ర త్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా భీ మేశ్వరస్వామి వసతి గృహం వద్ద డీఈ రా మ్కిషన్రావు ఆధ్వర్యంలో సిబ్బందికి ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.
ఆలయ లడ్డూ తయారీ కేంద్రం, నిత్యాన్నదాన సత్రం, విద్యుత్ విభాగం, ఎస్పీఎఫ్, హోంగార్డులు, ఔట్సోర్సింగ్ సి బ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సి న జాగ్రత్తలు, భక్తులను సురక్షితంగా బయటకు తరలించే విధానం, సిబ్బంది తమను తాము ఎలా రక్షించుకోవాలన్న అంశాలను అధికారులు డెమో ద్వారా వివరించారు. గ్యా స్ సిలిండర్ లీకై మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, అగ్నిమాపక సిలిండర్ల వినియోగం, వంట నూనెతో ఏర్పడే చి న్నపాటి మంటలను నియంత్రించే విధానాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు.
ప్రమాద సమయంలో అప్రమత్తతే రక్ష
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భ యాందోళనలకు గురికాకుండా ప్రశాంతం గా వ్యవహరించాలని అధికారులు సూచించారు. భక్తుల్లో తొక్కిసలాట జరగకుండా స మీపంలోని నిష్క్రమణ ద్వారాల వైపు తరలించాలని తెలిపారు. వీలైతే విద్యుత్, గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని సూచించారు. అగ్నిమాపక సిలిండర్ వినియోగంలో పాస్ విధానాన్ని పాటించాలని వివరించారు. సేఫ్టీ పిన్ తొలగించి, మంటల అడుగు భాగానికి నాజిల్ను గురిపెట్టి, హ్యాండిల్ను నొక్కుతూ అటూ ఇటూ స్ప్రే చేయాలని తెలిపారు.
గ్యాస్, నూనె మంటలపై నేరుగా నీరు పోయకూడదని హెచ్చరించారు. తగిన పరిస్థితుల్లో తడి గోనె సంచి లేదా మందపాటి దుప్పటితో కప్పి మంటలకు ఆక్సిజన్ అందకుండా చేయవచ్చని వివరించారు. చిన్నపాటి నూనె మంటలపై బేకింగ్ సోడా ఉపయోగించే విధానాన్ని కూడా డెమో ద్వారా చూపించారు.దట్టమైన పొగ కమ్ముకున్నప్పుడు నేలకిందకు వంగి బయటకు రావాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 101 లేదా 112కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.






